Indonesia: ఇండోనేషియాలో భూకంపం...సునామీ ముప్పు లేదు
ABN , First Publish Date - 2023-01-16T08:04:35+05:30 IST
ఇండోనేషియా దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది....
సుమత్రా ద్వీపం(ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది.(Indonesia) ఇండోనేషియా దేశంలోని సుమత్రా (Sumatra)ద్వీపం తీరంలో భూకంప కేంద్రం(Earthquake) అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.(no tsunami alert) సోమవారం ఉదయం 6.30 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది.
ఇండోనేషియా దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 21వతేదీన పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించారు. ఈ భూకంపం వల్ల మరో 600 మంది గాయపడ్డారు. సులవేసిలో 2018వ సంవత్సరంలో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 4,340 మంది మరణించారు.