Elon Musk: కరోనా బూస్టర్ డోస్‌తో ఆసుపత్రిపాలయ్యా.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-27T15:04:39+05:30 IST
కరోనా బూస్టర్ డోస్ పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ బూస్టర్ డోస్ (Covid Booster Dose) తీసుకున్నాక తనలో వ్యాధి లక్షణాలు కనిపించాయని.. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరానని అన్నారు.
న్యూయార్క్: కరోనా బూస్టర్ డోస్ పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ బూస్టర్ డోస్ (Covid Booster Dose) తీసుకున్నాక తనలో వ్యాధి లక్షణాలు కనిపించాయని.. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరానని అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్(X) లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతోందని, కొన్ని దేశాలు దాని వాడకాన్ని నిలిపివేశాయనే వ్యాఖ్యలతో ఓ వీడియో వైరల్ అయింది.
స్పందించిన ఓ నెటిజన్.. 'ఏ వ్యాక్సిన్ 100 శాతం సరిగ్గా పని చేయదు. వ్యాధిలో రకాలు వ్యాక్సిన్ కెపాసిటీ తగ్గేలా చేస్తాయి’ అని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన మస్క్.. "ప్రజలు బూస్టర్ డోస్ వేసుకోవాలనే నిబంధనే ఆందోళనకరంగా మారింది. మా కంపెనీలో ఉద్యోగులకు బూస్టర్ డోస్ వేయించేబదులు జైలుకు పంపడం మంచిది. నేను మూడో సారి బూస్టర్ డోస్ వేసుకునేసరికి దాదాపు ఆసుపత్రిపాలయ్యా" అని మస్క్ అన్నారు. వ్యాక్సిన్ డోస్ లు పూర్తికాక ముందే తనకు కొవిడ్ వచ్చింది. జలుబు, జ్వరంతో బాధపడినట్లు మస్క్ పేర్కొన్నాడు. తనకు వ్యాక్సిన్లపై నమ్మకం లేదని కాదు.. నివారణ వ్యాధి కంటే అధ్వానంగా ఉండకూడదనేదే నా అభిప్రాయం. బూస్టర్ డోస్ సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.