Share News

Elon Musk: 'మీ ప్రొడక్ట్‌ని మీరే ఉపయోగించట్లేదు'.. జుకర్ బర్గ్‌‌కి మస్క్ చురకలు

ABN , First Publish Date - 2023-11-02T17:05:32+05:30 IST

ఎక్స్‌(X)కి పోటీగా మెటా సీఈవో జుకర్ బర్గ్( Mark Zuckerberg).. థ్రెడ్స్(Threads) అనే సోషల్ మీడియా యాప్ తెచ్చారు. అయితే వారంరోజులుగా జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పోస్టులు పెట్టకపోవడంతో మస్క్ ఆయనపై వ్యంగ్యంగా స్పందించారు.

Elon Musk: 'మీ ప్రొడక్ట్‌ని మీరే ఉపయోగించట్లేదు'..  జుకర్ బర్గ్‌‌కి మస్క్ చురకలు

న్యూయార్క్: స్పేస్ ఎక్స్(Space X) అధినేత, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్స్ ని ఆయన స్వాధీనం చేసుకునే ముందు, తరువాత కూడా ఎంత బిజీగా ఉన్నా.. ఎక్స్‌లో పోస్టులు మాత్రం తప్పకుండా పెట్టేవారు. ఎక్స్‌(X)కి పోటీగా మెటా సీఈవో జుకర్ బర్గ్( Mark Zuckerberg).. థ్రెడ్స్(Threads) అనే సోషల్ మీడియా యాప్ తెచ్చారు. అయితే వారంరోజులుగా జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పోస్టులు పెట్టకపోవడంతో మస్క్ ఆయనపై వ్యంగ్యంగా స్పందించారు. వారం రోజులుగా ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడంతో ఓ నెటిజన్ జుకర్ బర్గ్ ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మస్క్.. ఆయన తయారు చేసిన ప్రొడక్ట్‌ని ఆయనే వాడట్లేదని ఎద్దేవా చేశారు.


ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్ అనథి కాలంలోని 100 మిలియన్లకు పైగా డౌన్లోడర్స్ ని పొందింది. తరువాత కొద్ది రోజులకు డౌన్లోడర్స్ తగ్గుతూ వచ్చారు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన మస్క్.. థ్రెడ్స్ ని ఘోస్ట్ టౌన్ అని అన్నారు. అక్కడ ఎవరూ ఉండరని.. ఆ ప్రాంతాన్ని ఘోస్ట్ టౌన్ అనే పిలుస్తారని విమర్శించారు. జుకర్ బర్గ్ క్రియేట్ చేసిన యాప్ ని ఆయనే వాడకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆ ఘోస్ట్ టౌన్ ఎడారిగా ఉంటుందని.. దాంట్లో ఉండటానికి ప్రజలు ఇష్టపడరని విమర్శించారు. 2023 జులైలో మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్ ని పరిచయం చేశారు. 5 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ ని సంపాదించుకున్న థ్రెడ్.. కొన్ని రోజుల్లోనే వినియోగదారుల సంఖ్యను కోల్పోతూ వచ్చింది. గ్రెగ్ అనే థ్రెడ్ యూజర్.. "థ్రెడ్ సీఈవో(CEO) పోస్ట్ చేసి 6 రోజులు అయ్యింది. యాప్‌ని జుకర్ బర్గ్ వదులుకున్నారా?" అని ప్రశ్నించగా.. మస్క్ పై విధంగా బదులిచ్చారు.

Updated Date - 2023-11-02T17:05:34+05:30 IST