Finland: ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం...ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ పదవీచ్యుతీ
ABN , First Publish Date - 2023-04-03T08:54:54+05:30 IST
ఫిన్లాండ్ దేశంలో ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాన కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది...
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధాన కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది.(Conservative Party Wins) ఇందులో రైట్-వింగ్ పాపులిస్టులు రెండవ స్థానంలో నిలిచారు, ప్రధాన మంత్రి సన్నా మారిన్ యొక్క సోషల్ డెమోక్రటిక్ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది.ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ పదవీచ్యుతుడయ్యారు.(Finland PM Sanna Marin)మొదటి మూడు పార్టీలకు దాదాపు 20శాతం ఓట్లు రావడంతో, ఏ పార్టీ కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.(Tight Elections) నార్డిక్ దేశ పార్లమెంటులోని 200 స్థానాలకు 22 పార్టీల నుంచి 2,400 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.ఫిన్లాండ్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై జాతీయ కూటమి పార్టీ నాయకత్వంలో చర్చలు ప్రారంభిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.