Real Life Joker: రియల్ లైఫ్ ‘జోకర్’.. 13 మందిని చంపాడు.. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు.. చివరికి !!

ABN , First Publish Date - 2023-07-31T21:53:30+05:30 IST

డీసీ కామిక్స్‌లో డార్క్ క్యారెక్టర్ ‘జోకర్’ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. తనకు జీవితంలో ఎదురైన పరాభావాల కారణంగా.. కరుడుగట్టిన విలన్‌గా మారుతాడు. ‘జోకర్’ ముసుగులో నేరాలకు పాల్పడుతుంటాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లని చంపుకుంటూ...

Real Life Joker: రియల్ లైఫ్ ‘జోకర్’.. 13 మందిని చంపాడు.. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు.. చివరికి !!

డీసీ కామిక్స్‌లో డార్క్ క్యారెక్టర్ ‘జోకర్’ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. తనకు జీవితంలో ఎదురైన పరాభావాల కారణంగా.. కరుడుగట్టిన విలన్‌గా మారుతాడు. ‘జోకర్’ ముసుగులో నేరాలకు పాల్పడుతుంటాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లని చంపుకుంటూ పోతుంటాడు. ఈ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది.. ఓ వ్యక్తి మారణకాండకు తెగబడ్డాడు. జోకర్‌లా వేషం ధరించి, ఒక ట్రెయిన్‌లో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఏకంగా 13 మందిని పొట్టన పెట్టుకున్నాడు. జోకర్ ముసుగులో అతడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో.. ఆ ముసుగు వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కనిపెట్టలేకపోయారు. అతడ్ని పట్టుకోవడం కోసం ముప్పుతిప్పలు పడ్డారు. అయితే.. చేసిన పాపం వదిలిపెట్టదు కదా! ఎట్టకేలకు అతడు పోలీసులకు దొరికాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..


అది 2021 సంవత్సరం. హాలోవీన్ జరుగుతున్న రోజులవి. ఓ ట్రెయిన్‌లో ఒక వ్యక్తి జోకర్ వేషం ధరించి, ఎంట్రీ ఇచ్చాడు. డీసీ క్యారెక్టర్ జోకర్ తరహాలో పిచ్చి గంతులు వేస్తూ.. ఒక 70 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తనతో పాటు తెచ్చుకున్న గన్స్ బయటకు తీసి.. ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు. అతడు సృష్టించిన ఈ మారణకాండను చూసి ఇతరులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని పారిపోయారు. ఆ రాక్షసుడు కూడా ఉన్నట్టుండి మాయమైపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి.. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. సీసీటీవీ ఫుటేజీల్లో అతడు జోకర్ రూపంలో ఉండటంతో.. ఎవరో పసిగట్టలేకపోయారు. అతనికి వ్యతిరేకంగా ఆధారాలు వెతకడం కోసం ముప్పుతిప్పలు పడ్డారు.

ఎట్టకేలకు పోలీసులు ఈ మారణకాండకు పాల్పడింది.. క్యోటా హటోరీ (26) అనే వ్యక్తి అని గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. అసలు ఎందుకు ఆ 13 మందిని చంపావని ప్రశ్నిస్తే.. ‘సరదా’ కోసమని షాకింగ్ సమాధానం ఇచ్చాడు. తనకు ప్రజల్ని చంపడమంటే ఇష్టమని చెప్పాడు. ఈ కేసులో హటోరీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. అతనికి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Updated Date - 2023-07-31T21:53:30+05:30 IST