India vs Canada: కెనడా ప్రధాని ట్రూడోకి సొంత గూటిలోనే పెద్ద ఫిట్టింగ్.. ఆ సాక్ష్యాలెక్కడ అంటూ నిలదీత

ABN , First Publish Date - 2023-09-29T21:29:37+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన రాజకీయ మైలేజ్, ఇమేజ్ కోసం అతడు చేసిన ఆరోపణలు..

India vs Canada: కెనడా ప్రధాని ట్రూడోకి సొంత గూటిలోనే పెద్ద ఫిట్టింగ్.. ఆ సాక్ష్యాలెక్కడ అంటూ నిలదీత

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన రాజకీయ మైలేజ్, ఇమేజ్ కోసం అతడు చేసిన ఆరోపణలు.. బ్యాక్‌ఫైర్ అయ్యి విమర్శలపాలయ్యేలా చేశాయి. ఈ అంశంలో ఇప్పటికే కొన్ని దేశాలు ట్రూడోని తిట్టిపోశాయి. ఉగ్రవాదులు, నేరస్తులకు కెనడా స్వర్గధామంగా మారిందంటూ కొరడా ఝుళపించాయి. భారత్ సైతం అవకాశం దొరికిన ప్రతీసారి అతనికి చురకలంటిస్తూ వస్తోంది. ఇప్పుడు అతనికి సొంత దేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. కెనడాలో ఉన్న భారత కమ్యూనిటీ.. ట్రూడో ఆరోపణల్ని చైల్డిష్‌గా పేర్కొంది. ఆ ఆరోపణలకు కచ్ఛితమైన సాక్ష్యాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

‘‘నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు చైల్డిష్‌గా ఉన్నాయి. అతడు చెప్తున్న మాటలన్నీ గాలి బుడగల్లాంటివి. కెనడాలో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే తీవ్రవాదులు ఉన్నారు. మిగిలిన సిక్కులకు ఆ ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదు’’ అని భారత కమ్యూనిటీలో సభ్యుడైన అమన్‌దీప్ సింగ్ ఛాబా అన్నారు. తాను చేసిన ఆరోపణలకు గాను ట్రూడో కచ్ఛితమైన సాక్ష్యాలను అందించాలన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలు భారత్, కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ట్రూడో చర్యలు బాధపెట్టేవిగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సమస్యలను సైతం దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చన్న ఆయన.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని కూడా అలాగే చర్చల ద్వారా పరిష్కరించాలని అభ్యర్థించారు.


ఇదే సమయంలో డాక్టర్ రాజ్ జగ్‌పాల్ అనే మరో సభ్యుడు సైతం ట్రూడో ఆరోపణలపై ధ్వజమెత్తారు. హిందువులు, సిక్కుల మధ్య కెనడా ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందని, కేవలం ఓట్లు పొందడం కోసమే ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. హిందువులు, సిక్కుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి.. ట్రూడో రాజీనామా అయినా చేయాలి, లేకపోతే ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇండో-కెనడియన్ మంజీత్ బిర్ మాట్లాడుతూ.. ప్రజలు సంతోషంగా ఉండేలా రెండు దేశాల మధ్య శాంతిని కొనసాగించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు. కెనడాలోని భారతీయ సమాజం ఆందోళన చెందుతోందన్న ఆయన.. ఈ సమస్య త్వరగా సమసిపోవాలని, పరిస్థితులు మెరుగుపడాలని రేయింబవళ్లు ప్రార్థిస్తున్నానన్నారు.

ఇదిలావుండగా.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో.. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొంది. ఇరుదేశాలు పరస్పర దౌత్యాధికారుల్ని సైతం బహిష్కరించాయి. మరోవైపు.. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం అందిస్తే, తాము తగిన చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హామీ ఇచ్చారు. అయితే.. కెనడా నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని ఆయన తెలిపారు. అంతేకాదు.. వ్యవస్థీకృత నేరాలు కెనడాలో గత కొన్నాళ్ల నుంచి గణనీయంగా పెరిగాయని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైతం తాము ఆ దేశంతో పంచుకున్నామన్నారు.

Updated Date - 2023-09-29T21:29:37+05:30 IST