North Korea: సముద్రగర్భంలో అణు డ్రోన్ పరీక్ష...కిమ్ జాంగ్ ఉన్ రేడియోయాక్టివ్ సునామీ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-03-24T11:17:44+05:30 IST

ఉత్తర కొరియా సముద్ర గర్భంలో అణు డ్రోన్‌ను పరీక్షించింది....

North Korea: సముద్రగర్భంలో అణు డ్రోన్ పరీక్ష...కిమ్ జాంగ్ ఉన్ రేడియోయాక్టివ్ సునామీ హెచ్చరిక
Kim Jong Un Tests Undersea Drone

ఉత్తర కొరియా సముద్ర గర్భంలో అణు డ్రోన్‌ను పరీక్షించింది.తమ దేశం రేడియోయాక్టివ్ సునామీ సృష్టిస్తుందని ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. అమెరికాపై అణుదాడి సామర్థ్యాన్ని(tested new nuclear) పెంచుకునేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తుందని ఆ దేశ కసరత్తులు సూచిస్తున్నాయి.మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన పరీక్షల్లో మాక్ న్యూక్లియర్ వార్‌హెడ్‌లతో అతికించిన క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. సముద్రం నీటి అడుగున డ్రోన్ పేలుడుకు (underwater attack drone)ముందు దాని తూర్పు తీరంలో దాదాపు 60 గంటల పాటు ప్రయాణించిందని నార్త్ కొరియా పేర్కొంది.దక్షిణ కొరియాతో సంయుక్తంగా సైనిక విన్యాసాలకు పాల్పడితే తాము పసిఫిక్ మహా సముద్రాన్ని ఫైరింగ్ రేంజ్ గా మారుస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

Updated Date - 2023-03-24T11:17:44+05:30 IST