Portugal Church: చర్చిలో బాలలపై ఫాస్టర్ల లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2023-02-15T11:10:11+05:30 IST
పోర్చుగల్ చర్చిలో 100 మందికి పైగా ఫాస్టర్లు బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు సంచలనం...
లిస్బన్ : పోర్చుగల్ చర్చిలో 100 మందికి పైగా ఫాస్టర్లు బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు సంచలనం సృష్టించాయి.(Portugal Church)బాలలను లైంగికంగా వేధించిన(Child harasment) ఫాస్టర్లు చర్చిల్లో కీలకపాత్ర వహిస్తున్నారని ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న కమిషన్ అధిపతి చెప్పారు. పోర్చుగల్లోని రోమన్ క్యాథలిక్ చర్చి సభ్యులు, ఫాస్టర్లు 70 ఏళ్లలో 4,815 మంది పిల్లలను లైంగికంగా వేధించారని సోమవారం ప్రచురించిన తుది నివేదికలో కమిషన్ పేర్కొంది.
లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది ఫాస్టర్లు(Priests Accused) ఉన్నారని విచారణ కమిషన్ కు నాయకత్వం వహించిన పిల్లల మానసిక రోగాల వైద్యుడు పెడ్రో స్ట్రెచ్ట్ చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారి జాబితాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కార్యాలయానికి పంపిస్తామని కమిషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య
విచారణ సమయంలో పిల్లలు, యుక్తవయస్కులతో నిందితులైన ఫాస్టర్లు సంభాషించకుండా నిషేధించామని స్ట్రెచ్ చెప్పారు. లైంగిక వేధింపుల ఘటనలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయని పోర్చుగీస్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా చెప్పారు.పోర్చుగీస్ బిషప్లు మార్చి 3వతేదీన సమావేశమై, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారిస్తామని ప్రధాని చెప్పారు.