Court: పెళ్లికి నిరాకరించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు.. దోషులకు జీవిత ఖైదు
ABN , Publish Date - Dec 20 , 2023 | 02:53 PM
పెళ్లికి నిరాకరించిందనే కారణంతో కుమార్తెను దారుణంగా హత్య చేయించిన పాకిస్థానీ(Pakistan) దంపతులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
రోమ్: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో కుమార్తెను దారుణంగా హత్య చేయించిన పాకిస్థానీ(Pakistan) దంపతులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన ఇటలీ(Italy)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమన్ అబ్బాస్(18) ఇటలీ దేశం బోలోగ్నా సమీపంలో నివసించేది. ఆమె తల్లిదండ్రులు పాకిస్థాన్ లో నివసించేవారు.
2021 మే నుంచి అబ్బాస్ కనిపించకుండా పోయింది. ఇటలీలో ఉన్న ప్రియుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆమె మిస్సింగ్ మిస్టరీ వీడింది. మేనమామే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని దర్యాప్తులో వెల్లడైంది.
తాము చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు అబ్బాస్‌పై ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మాట వినని కారణంగా మేనమామతో కుమార్తె హత్యకు పన్నాగం పండారు. అదే ఏడాది మే నెలలో ఆమె గొంతు కోసం మేనమామ కిరాతకంగా హత్య చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి శవాన్ని పూడ్చిపెట్టారు. ప్రియుడి ఫిర్యాదుతో పాకిస్థాన్ పోలీసుల సహకారంతో ఇటలీ పోలీసులు దర్యాప్తు చేశారు.
మేనమామ డానిష్ హస్త్నెన్ ను పాకిస్థాన్ లో అరెస్టు చేసి 2023 ఆగస్టులో ఇటలీకి రప్పించారు. నిందితులలో నలుగురు కోర్టులో విచారణకు హాజరయ్యారు. తల్లి నాజియా షాహీన్ ఇప్పటికీ పరారీలో ఉంది. ఈ కేసుపై విచారించిన కోర్టు తల్లిదండ్రులు, మేనమామను దోషులుగా తేల్చింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"