Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌కు శ్వాసకోశ సమస్యలు...ఆసుపత్రిలో చేరిక
ABN , First Publish Date - 2023-03-30T07:36:51+05:30 IST
పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు....
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.(Pope Francis) శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కోవిడ్‌కు సంబంధించినది కాదని వైద్యులు పరీక్షల్లో నిర్ధారించారు. పోప్ ఫాన్సిస్ కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో(Hospitalised) చికిత్స తీసుకుంటారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో(Breathing difficulties) పోప్ ఫ్రాన్సిస్ చికిత్స కోసం రోమ్ ఆసుపత్రిలో చేరారని వాటికన్ తెలిపింది.86 ఏళ్ల పోప్‌కు కరోనా లేదని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ఒక ప్రకటనలో తెలిపారు.
2021వ సంవత్సరంలో పోప్ కు ఫ్రాన్సిస్ గెమెల్లి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి పెద్ద పేగు తొలగించారు.ఫ్రాన్సిస్ ఆరోగ్య సమస్యల గురించి తాను ఇప్పుడే తెలుసుకున్నానని దీనిపై తాను ఆందోళన చెందుతున్నామని యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ చెప్పారు.