Qantas flight: విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం...సిడ్నీలో సురక్షితంగా ల్యాండింగ్

ABN , First Publish Date - 2023-01-18T11:37:35+05:30 IST

న్యూజిలాండ్‌కు చెందిన క్వాంటాస్ ఎయిర్‌వేస్ విమానం ఇంజినులో సాంకేతిక లోపం ఏర్పడింది....

Qantas flight: విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం...సిడ్నీలో సురక్షితంగా ల్యాండింగ్
Qantas flight

సిడ్నీ: న్యూజిలాండ్‌కు చెందిన క్వాంటాస్ ఎయిర్‌వేస్ విమానం ఇంజినులో సాంకేతిక లోపం ఏర్పడింది.(Qantas flight) క్వాంటాస్‌కు చెందిన విమానం ప్రమాద సంకేతాన్ని జారీ చేయడంతో సిడ్నీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.(Sydney lands safely) బోయింగ్ 737 విమానం రెండు ఇంజన్లలో ఒక దానిలో సాంకేతిక లోపం(Engine trouble) ఏర్పడిందని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ తెలిపింది.సిడ్నీ విమానాశ్రయంలో క్వాంటాస్ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఇంజినులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు అంచనా వేసిన తర్వాత తాము దీనిపై ప్రకటన చేస్తామని క్వాంటాస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి చెప్పారు.

Updated Date - 2023-01-18T11:37:39+05:30 IST