Share News

Israel-Hamas War: లండన్ బీబీసీ కార్యాలయంపై రెడ్‌ పెయింట్ విసిరేసిన అగంతకులు

ABN , First Publish Date - 2023-10-14T21:26:14+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం పలు ప్రపంచ దేశాల్లో నిరసనల రూపాల్లో కనిపిస్తోంది. లండన్‌ లోని బీబీసీ ప్రధాన కార్యాలయానికి సైతం ఈ నిరసనల సెగ తప్పలేదు. లండన్‌‌లోని లాంగ్హామ్ స్ట్రీట్‌లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయంపై అగంతకులు విధ్వంసానికి దిగారంటూ బీబీసీ జర్నలిస్ట్ డెర్బీషైర్ ఒక వీడియో ఫుటేజ్ విడుదల చేశారు.

Israel-Hamas War: లండన్ బీబీసీ కార్యాలయంపై రెడ్‌ పెయింట్ విసిరేసిన అగంతకులు

లండన్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ప్రభావం పలు ప్రపంచ దేశాల్లో నిరసనల రూపాల్లో కనిపిస్తోంది. లండన్‌ (London)లోని బీబీసీ (BBC) ప్రధాన కార్యాలయానికి సైతం ఈ నిరసనల సెగ తప్పలేదు. లండన్‌‌లోని లాంగ్హామ్ స్ట్రీట్‌లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయంపై అగంతకులు విధ్వంసానికి దిగారంటూ బీబీసీ జర్నలిస్ట్ డెర్బీషైర్ ఒక వీడియో ఫుటేజ్ విడుదల చేశారు. బీబీసీ కార్యాలయం ఎంట్రన్స్ లాక్ చేసి ఉందని, కొందరు ఎంట్రన్స్ వద్ద ఎరుపు రంగు స్ప్రే చేశారని, శనివారం ఉదయం కార్యాలయానికి రాగానే తాను ఈ విషయం గమనించానని ఆమె తెలిపారు. కాగా, పాలస్తీనా అనుకూల వాదులు సుమారు 50,000 మంది ప్రదర్శనకు దిగేందుకు సిద్ధం కావడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


కాగా, అటు.. ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఉత్తర గాజా ప్రాంతంలోని పాలస్తీనీయులను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేయడంతో పరిస్థితి మరింత ముదిరింది. ఇజ్రాయెల్ సైనిక చర్య పేరుతో పాలస్తీనా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని విరుచుకుపడిన సౌదీ అరేబియా తక్షణ సమావేశం కోసం ఇస్లామిక్ దేశాల కూటమికి పిలుపునిచ్చింది. వచ్చే వారం జెద్దాలో సమావేశం జరుగనుంది.

Updated Date - 2023-10-14T21:26:14+05:30 IST