ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 34 మందికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2023-05-01T22:28:38+05:30 IST

పావ్లోరాడ్‌(Pavlograd district)లో లాజిస్ట‌క్‌పై హ‌బ్‌ లక్ష్యంగా ర‌ష్యా టార్గెట్ చేసినట్లు ..

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 34 మందికి తీవ్రగాయాలు

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై ర‌ష్యా(Russia) మ‌ళ్లీ విరుచుకుప‌డింది. మూడు రోజుల తేడాలోనే ఇవాళ ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల వ‌ర్షం(Missile Strikes) కురిపించింది. దాదాపు 18 క్రూయిజ్ క్షిపణుల(Cruise Missles)ను ర‌ష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ వర్గాలు పేర్కొన్నాయి. పావ్లోరాడ్‌(Pavlograd district)లో లాజిస్ట‌క్‌పై హ‌బ్‌ లక్ష్యంగా ర‌ష్యా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పావ్లోరాడ్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన క్షిపణి దాడిలో 34 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు, ఒక‌రు మృతిచెందారు.క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. డ‌జ‌న్ల సంఖ్య‌లో నేలమట్టమయ్యాయి.

సోమవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ అంతటా రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. పావ్‌లోగ్రాడ్ జిల్లాపై క్షిపణి దాడి కారణంగా 34 మంది గాయపడ్డారని డ్నిప్రోపెట్రోవ్స్క్ రీజియన్ హెడ్ సెర్గీ లైసాక్ సోషల్ మీడియాలో ధృవీకరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా తెల్లవారుజామున 2:30 గంటలకు దాడి చేసిందని, మాస్కో దళాలు ప్రయోగించిన 18 క్షిపణుల్లో 15ని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్ ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-01T22:28:38+05:30 IST