ISIS Leader: సోమాలియాలో ఐఎస్ఐఎస్ సీనియర్ లీడర్ బిలాల్ అల్ సుదానీ హతం
ABN , First Publish Date - 2023-01-27T07:18:53+05:30 IST
సోమాలియాలో అమెరికా సైన్యం దాడి జరిపిన ఘటన సంచలనం రేపింది....
వాషింగ్టన్ : సోమాలియాలో అమెరికా సైన్యం దాడి జరిపిన ఘటన సంచలనం రేపింది. సోమాలియాలో అమెరికా జరిపిన దాడిలో ఐఎస్ఐఎస్ సీనియర్ నాయకుడు(Senior ISIS Leader) బిలాల్ అల్ సుదానీ(Bilal al-Sudani) హతమయ్యాడు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశంతో ఆ దేశ పారామిలటరీ దళాలు సోమాలియాలోని(Somalia) పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కీలక ప్రాంతీయ నాయకుడు బిలాల్ అల్-సుదానీని పట్టుకునేందుకు యత్నించారు.
అమెరికా సైన్యం జరిపిన కాల్పుల్లో(US Raid) బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడని యూఎస్ సైనికాధికారులు శుక్రవారం ప్రకటించారు. సంఘటనా స్థలంలో 10 మంది సుడానీ ఇస్లామిక్ స్టేట్ సహచరులు మరణించారు.
యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల ప్రకారం యూఎస్ మిలటరీ ఉత్తర సోమాలియాలో ఆపరేషన్ నిర్వహించిందని డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇస్లామిక్-స్టేట్ ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చడంతోపాటు సోమాలియాలో తీవ్రవాద అల్-షబాబ్ ఉద్యమం కోసం యోధులను నియమించి వారికి శిక్షణ ఇచ్చాడని యూఎస్ అధికారులు చెప్పారు.