UK: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్‌లో మరీ ఇంత దారుణ పరిస్థితా..! నమ్మశక్యం కానీ దృశ్యాలు!

ABN , First Publish Date - 2023-05-11T19:58:30+05:30 IST

రవి అస్తమమించని సామ్రాజ్యమంటూ ఒకప్పుడు ప్రసంశలు అందుకున్న బ్రిటన్‌లో ప్రస్తుతం అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి.

UK: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్‌లో మరీ ఇంత దారుణ పరిస్థితా..! నమ్మశక్యం కానీ దృశ్యాలు!

ఇంటర్నెట్ డెస్క్: రవి అస్తమమించని సామ్రాజ్యమంటూ ఒకప్పుడు ప్రసంశలు అందుకున్న బ్రిటన్‌లో(Britain) ప్రస్తుతం అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. జీవన వ్యవయాలు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో(Inflation) యువతీయువకులు చిన్న చిన్న దొంగతనాలకు(Petty theft) దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి పది మంది యువతలో ఒకరు సూపర్ మార్కెట్లలో దొంగతనాలు చేసినట్టు తాజా సర్వేలో తేలింది. సూపర్ మార్కెట్ కౌంటర్ల వద్ద వస్తువుల స్కానింగ్‌లో కావాలని తప్పులు చేసి బిల్లు చెల్లించకుండా వచ్చేస్తున్నట్టు వెల్లడైంది.

బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకారం, గత ఏడాది మార్చి నుంచి ఆహారం ఇతర ఆల్కహాల్ యేతన పానీయాల ధరలు 19.3 శాతం మేర పెరిగాయి. పొదుపు చర్యల యాప్ జిప్‌జీరో సర్వే ప్రకారం, పెరుగుతున్న పచారీ ఖర్చులను తట్టుకునేందుకు ప్రతిఐదుగురిలో ఒకరు ఆర్థికసాయం తీసుకున్నారట. నిత్యావసరాల కొనుగులోకు ఆరు శాతం మంది తమ స్నేహితులు, బంధువుల నుంచి చేబదుళ్లు తీసుకున్నారు. ఓ 8 శాతం మంది ఆహారం కొనుగులోకు తమ క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మరో ఐదు శాతం మంది ఉచిత ఆహార కేంద్రాలను( ఫుడ్ బ్యాంక్) ఆశ్రయించారు.

‘‘పెరుగుతున్న ఆహార ధరలు గృహస్తులను ఆర్థికంగా తీవ్రస్థాయిలో అస్థిరపరుస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు, ఇంతకు రెట్టింపు సంఖ్యలో యువజనులు ఇతరుల నుంచి ఆర్థిక సాయం ఆసిస్తున్నారంటే ఆహార ధరల పెరుగుదల బీదరికానికి దారి తీస్తోందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు’’ అని జిప్ జిరో సీఈఓ మోషీన్ రషీద్ వ్యాఖ్యానించారు. ‘‘పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తున్న బ్రిటన్‌ ప్రజల సామర్థ్యం అసాధారణం. ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక మంది కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అయితే, ఇలాంటి సర్దుబాట్లకు అవకాశాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఆహారం కోసం అనేక మంది దొంగతనాలు చేస్తూ ఉచిత ఆహార కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం బ్రిటన్ సమాజపు తీరుతెన్నులను మార్చేస్తోంది. జీవన ప్రమాణాలకు సరికొత్తగా నిర్వచిస్తోంది’’ అని కామెంట్ చేశారు. ఈ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు వివిధ రంగాలకు పత్యేకించి ప్రభుత్వ సాయం అందాలని బ్రిటన్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-05-11T19:58:33+05:30 IST