Bible Burning : బైబిల్‌ను తగులబెడుతూ నిరసన తెలిపేందుకు స్వీడన్ పోలీసుల అనుమతి
ABN , First Publish Date - 2023-07-15T14:59:15+05:30 IST
తోరాస్, బైబిల్స్‌ను తగులబెడుతూ ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద నిరసన తెలిపేందుకు నిరసనకారులకు స్వీడన్ పోలీసులు అనుమతి ఇచ్చారు. యూరోపియన్ జూయిష్ కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది రెచ్చగొట్టే చర్య అని, నాగరిక సమాజంలో ఇటువంటివాటికి స్థానం ఉండకూడదని హెచ్చరించింది.
స్టాక్‌హోం : తోరాస్, బైబిల్స్‌ను తగులబెడుతూ ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద నిరసన తెలిపేందుకు నిరసనకారులకు స్వీడన్ పోలీసులు అనుమతి ఇచ్చారు. యూరోపియన్ జూయిష్ కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది రెచ్చగొట్టే చర్య అని, నాగరిక సమాజంలో ఇటువంటివాటికి స్థానం ఉండకూడదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఐజాక్ హెర్జోగ్ కూడా స్వీడన్ పోలీసు అధికారుల నిర్ణయాన్ని ఖండించారు. జూన్ నెలలో ఓ వ్యక్తి స్టాక్‌హోంలోని ఓ మసీదు వద్ద ఖురాన్‌ను తగులబెట్టిన సంగతి తెలిసిందే.
స్వీడన్ నేషనల్ రేడియో శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, స్టాక్‌హోంలోని ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు, తోరాస్, బైబిల్స్ తగులబెడుతూ నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఓ వ్యక్తి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన స్వీడన్ పోలీసు అధికారులు అనుమతి మంజూరు చేశారు.
యూరోపియన్ జూయిష్ కాంగ్రెస్ శుక్రవారం దీనిపై స్పందిస్తూ, స్వీడన్ అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది రెచ్చగొట్టే చర్య అని, జాత్యహంకారపూరితమని, దుష్టబుద్ధితో కూడినదని ఆరోపించింది. ఇటువంటి దుశ్చర్యలకు నాగరిక సమాజంలో స్థానం లేదని తెలిపింది. ఈ సంస్థ ప్రెసిడెంట్ ఏరియల్ ముజికాంట్ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో, ప్రజల మతపరమైన, సాంస్కృతికపరమైన మనోభావాలను అణచివేయడమంటే, మైనారిటీలకు గౌరవం లేదని స్పష్టంగా చెప్పడమేనని ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యం గురించి తప్పుడు వాదనల ఆధారంగా నిర్వహించే ఇటువంటి చర్యలు స్వీడన్‌కు గౌరవప్రదం కాదని తెలిపారు. ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునే ఏ ప్రభుత్వమైనా ఇటువంటివాటిని నిరోధించాలన్నారు.
స్వీడిష్ అధికారుల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. ముస్లింలకు పవిత్రమైన ఖురాన్‌ను తగులబెట్టడాన్ని తాను ఇజ్రాయెల్ ప్రెసిడెంట్‌గా ఖండిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు జూయిష్ బైబిల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో తన హృదయం పగిలిందన్నారు. ఇది జూయిష్ ప్రజలకు ఎటర్నల్ బుక్ అని చెప్పారు.
జూన్ నెలాఖరులో ఓ వ్యక్తి స్టాక్‌హోంలోని ఓ మసీదు వద్ద ఖురాన్‌ను తగులబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బాగ్దాద్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. స్వీడిష్ ఎంబసీ వద్ద నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ
Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు