Home » Sweden
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబుల్ బహుమతి.. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్‌తోపాటు జాన్ జంపర్‌ను వరించింది. ప్రోటీన్ల ఆవిష్కరణలో అందించిన సేవలకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్(Monkey pox) కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఈ వైరస్ మరో రెండు దేశాల్లోకి ప్రవేశించింది. దాయాది పాకిస్థాన్ సహా.. స్వీడన్ దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లింగ బేధాలు క్రమంగా మారుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభేదాలను పక్కనపెట్టి వాటిని సమ్మతించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో తాజాగా ఐరోపాలోని ప్రముఖ దేశం స్వీడన్(Sweden) చట్టపరమైన లింగ మార్పిడి వయస్సును(age) 18 ఏళ్ల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించింది.
ప్రస్తుత చలికాలంలో ఉదయం వేళ బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఓ మహిళ(woman) మాత్రం ఏకంగా -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బయటకు వెళ్లింది. అలా వెళ్లిన క్రమంలో ఆమెకు ఓ వింతైన అనుభవం ఎదురైంది. ఆమె వెంట్రుకలు పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాయి.
ఒక హోదాలో ఉన్న నాయకులు అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్తుంటారు. సున్నితమైన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ముఖ్యంగా.. మతపరమైన అంశాల జోలికి వెళ్లి, లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తుంటారు.
భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్ కు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.
యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్.
తోరాస్, బైబిల్స్‌ను తగులబెడుతూ ఇజ్రాయెలీ ఎంబసీ వద్ద నిరసన తెలిపేందుకు నిరసనకారులకు స్వీడన్ పోలీసులు అనుమతి ఇచ్చారు. యూరోపియన్ జూయిష్ కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది రెచ్చగొట్టే చర్య అని, నాగరిక సమాజంలో ఇటువంటివాటికి స్థానం ఉండకూడదని హెచ్చరించింది.
ఈద్ అల్-అదా సందర్భంగా స్వీడన్‌లో ఖురాన్‌ను అవమానించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా యవుమ్-ఈ-తకద్దుస్-ఈ-ఖురాన్ నిర్వహించాలని, గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.