Egypt : పట్టాలు తప్పిన రైలు...ఇద్దరి మృతి, 16మందికి గాయాలు
ABN , First Publish Date - 2023-03-08T08:08:26+05:30 IST
ఈజిప్టు దేశంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా...
కైరో(ఈజిప్టు): ఈజిప్టు దేశంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.(Train Derails) ఉత్తర కైరో నగరంలో (Northern Egypt)ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు మరణించారు. రైలు నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ గుండా ప్రయాణిస్తుండగా పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్పారు. ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.ఘటనాస్థలికి కనీసం 20 అంబులెన్స్‌లను పంపించామని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Oyo Founder: రీతేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ హాజరు
ఈజిప్టు దేశంలో రైల్వే వ్యవస్థ సరిగా పనిచేయక పోవడంతో తరచూ రైలు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. రైలు ప్రమాదాలను తగ్గించడానికి ఈజిప్టు దేశంలో రైల్వేఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు.2021వ సంవత్సరంలో దక్షిణ ఈజిప్టు నగరమైన తహతాలో రెండు రైళ్లు ఢీకొనడంతో 32 మంది మరణించారు. ఆ సంవత్సరం తర్వాత కల్యుబియా ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పడంతో 11 మంది మరణించారు.ఈజిప్టులో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2002లో జరిగింది. కైరో నుంచి దక్షిణ ఈజిప్టుకు రాత్రిపూట ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగడంతో 300 మందికి పైగా ప్రయాణికులు మరణించారు.