UN: క్షమాపణలు చెప్పిన ఐక్యరాజ్య సమితి.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-01-21T21:00:23+05:30 IST

తాలిబన్ల జెండా ముందు ఐక్యరాజ్య సమితి సిబ్బంది కొందరు నిలబడి ఫొటో దిగిన ఉదంతం వైరల్ కావడంతో ఐక్యరాజ్య సమితి తాజాగా క్షమాపణలు చెప్పింది.

UN: క్షమాపణలు చెప్పిన ఐక్యరాజ్య సమితి.. ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్ల జెండా ముందు ఐక్యరాజ్య సమితి సిబ్బంది కొందరు నిలబడి ఫొటో దిగిన ఉదంతం వైరల్ కావడంతో ఐక్యరాజ్య సమితి తాజాగా క్షమాపణలు చెప్పింది. తన సిబ్బంది సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్య సమితి డిప్యుటీ సెక్రెటరీ జనరల్ అమీనా మహ్మద్ ఇటీవల ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా సిబ్బంది ఈ ఫొటో దిగినట్టు తెలుస్తోంది. ‘‘ఇలాంటి ఫొటో దిగుండాల్సింది కాదు. ఇది కచ్చితంగా తప్పే. దీనికి మేము క్షమాపణ చెబుతున్నాం. జరిగిన తప్పు గురించి ఉన్నతాధికారి ఆ సిబ్బందిని ప్రశ్నించారు’’ అని యూఎన్ సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి మీడియాతో వ్యాఖ్యానించారు.

కాగా.. తన పర్యటన సందర్భంగా డిప్యుటీ సెక్రెటరీ జనరల్ అప్ఘానిస్థాన్‌లో మహిళల హక్కుల ఉల్లంఘటనలపై తాలిబన్ల వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఫొటోపై తాలిబన్ల వ్యతిరేక కూటమి నేషనల్ ఫ్రంట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితి పరపతిని తగ్గించే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని యూఎన్ అధిపతి ఆంటోనియో గుటెర్రస్‌ను అభ్యర్థించింది.

Updated Date - 2023-01-21T21:00:44+05:30 IST