Tamilnadu Rains: తమిళనాడులో 10కి చేరిన మృతుల సంఖ్య.. మోదీకి తక్షణ సాయం కోరిన స్టాలిన్
ABN , Publish Date - Dec 20 , 2023 | 10:27 AM
తమిళనాడులో మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు.
చెన్నై: తమిళనాడులో మిచాంగ్ తుపాన్(Michaung Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చిగురుటాకులా వణికిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాలు ఇంకా తగ్గకపోవడంతో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.
తిరునెల్వేలి, తెన్ కాసి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే రద్దు(South Central Railway) చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. నాగర్‌కోయిల్-కన్నీకుమారి ఎక్స్‌పీఎల్, నాగర్‌కోయిల్-తిరునెల్‌వేలి ఎక్స్‌పీఎల్ పూర్తిగా రద్దయ్యాయి.
రూ.12 వేల కోట్లు ఇవ్వండి..
తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రజలు సర్వస్వం కోల్పోయారని సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.7,300 కోట్లు, శాశ్వత ఉపశమనం కోసం రూ.12 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి విన్నవించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.6వేల సాయం ప్రకటించారు.
స్టాలిన్ మాట్లాడుతూ.. "100 ఏళ్లలో తమిళనాడులో అతివృష్టి వల్ల ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయ నిధి అందించాలి. ఎనిమిది మంది మంత్రులు, 10 మంది IAS అధికారులను రెస్క్యూ ఆపరేషన్ కోసం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాం. SDRFకి చెందిన 15 బృందాలు, 10 NDRF బృందాలు ఇతర బలగాలతో సహాయక చర్యలు చేపట్టాయి.
SDRFకి చెందిన 230 మంది పురుషులు 12,553 మందిని రక్షించారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నాం" అన్నారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"