Home » Tamilnadu News
తమిళనాడు సర్కారు గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ 1971లో ఏర్పడిన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి పరిరక్షణపై నివేదిక రూపొందిస్తుందని, మధ్యంతర నివేదిక వచ్చే జనవరిలో సమర్పిస్తారని తెలిపారు
తమిళనాడు రాష్ట్రంలో, గవర్నర్ ఆమోదం లేకుండా పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు పరిగణించాలన్న తీర్పు ఇచ్చింది. ఇందులో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల చాన్సలర్ పదవిని ముఖ్యమంత్రి కోసం మార్చడం, వివిధ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణలు ఉన్నాయి
తమిళంలో నేమ్బోర్డులు ఏర్పాటు చేయని సంస్థలకు మే నెల నుంచి రూ. 2వేల జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల తమిళంలో పెద్దగా, ఇంగ్లిష్లో చిన్నగా పేర్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది
ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత తమిళనాట కూడా భారీ ఆశలు పెట్టుకుంటోంది బీజేపీ. అందుకోసమే ఎన్నికలకు ఏడాది ముందే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటించింది. జనసేనాని ప్రచారం కూడా తమిళనాట ఎంతోకొంత లాభిస్తుందని ఆశిస్తోంది.
తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి.. హిందూ మహిళలనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను సీఎం స్టాలిన్ మంత్రి పదవి నుంచి తొలగించారు.
తమిళనాడులో ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను ఎండలో కూర్చోపెట్టి పరీక్ష రాయించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోతో ప్రభుత్వ చర్యలు ప్రారంభమయ్యాయి
వీఐటీ యూనివర్సిటీ డే సందర్భంగా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జస్టిస్ సుందరేశ్ లక్ష్యసాధనకు కష్టపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు
తమిళనాడు బీజేపీ అధ్యక్షపదవికి అజిత్ అన్నామలై కొనసాగాలని ఆసక్తి వ్యక్తం చేయలేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా ఆయన దీనిపై మరింత వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్ ప్రకటించారు
Mk Stalin Fires Back on Yogi: తమిళనాడు సీఎం, డీఎంకే నాయకుడు స్టాలిన్ ఉత్తరప్రదేశ్ యోగి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించదని, బలవంతంగా ప్రజలపై త్రిభాషా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న మీ దురహంకార వైఖరినే మా పోరాటమని స్పష్టం చేశారు.