2 lakh people: పల్లెకు పోదాం చలో.. చలో

ABN , First Publish Date - 2023-01-13T07:44:48+05:30 IST

సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లలో జరుపుకొనేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం రాష్ట్రప్రభుత్వ రవాణా శాఖ ప్రకటించిన

2 lakh people: పల్లెకు పోదాం చలో.. చలో

- కదిలిన సంక్రాంతి ప్రత్యేక బస్సులు

- సొంతూళ్లకు వెళ్లిన 2 లక్షల మంది

ప్యారీస్‌(చెన్నై), జనవరి 12: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లలో జరుపుకొనేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం రాష్ట్రప్రభుత్వ రవాణా శాఖ ప్రకటించిన ప్రత్యేక బస్సులు గురువారం నగరం నుంచి కదిలాయి. కోయంబేడు బస్‌ టెర్మినల్‌, తాంబరం శానిటోరియం, పూందమల్లి, మాధవరం బస్‌స్టేషన్‌ తదితర ప్రాంతాల నుంచి రోజువారీ బస్సులతో పాటు 651 ప్రత్యేక బస్సులు నడుపగా, సుమారు 2 లక్షల మందికి పైగా ప్రయాణం చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం మొత్తం 3,955 బస్సులు, శనివారం 4,043 బస్సులు(4,043 buses) నడుపనున్నారు. 14వ తేది వరకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 10,749 బస్సులు నడుపనున్నారు. పండుగ ముగించుకొని మళ్లీ తిరుగు ప్రయాణం నిమిత్తం రాష్ట్ర రవాణా శాఖ బస్సులు నడుపనుంది. బస్సు సేవల గురించి 94450114 450, 9445014436 అనే నెంబర్లను సంప్రదించవచ్చు.

అధిక ఛార్జీలు...

పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలుచేసే ఆమ్నీ బస్సులపై ఫిర్యాదు చేసేందుకు అనుకూలంగా టోల్‌ ఫ్రీ నెంబర్లు విడుదలయ్యాయి. 1800 425 9151, 044-24749002 అనే నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, కోయంబేడు బస్‌ టెర్మినల్‌లో కంట్రోల్‌ రూమ్‌, 20 సమాచార కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక బస్సులు బయల్దేరనున్న ఆరు ప్రాంతాలకు నగరం నలుమూలల నుంచి ప్రయాణికులు సులువుగా వెళ్లేందుకు ఎంటీసీ సంస్థ ఈ నెల 14వ తేది వరకు లింక్‌ బస్‌ సర్వీసులు నడుపనుంది.

Updated Date - 2023-01-13T07:44:51+05:30 IST