Hazaribagh: అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు కార్మికుల దుర్మరణం

ABN , First Publish Date - 2023-09-22T18:14:17+05:30 IST

జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)కి 120 కి.మీ.ల దూరంలో ఉన్న ఓ అల్యూమీనియం ఫ్యాక్టరీ(Alluminium Factory)లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.

Hazaribagh: అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు కార్మికుల దుర్మరణం

రాంచీ: జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)కి 120 కి.మీ.ల దూరంలో ఉన్న ఓ అల్యూమీనియం ఫ్యాక్టరీ(Alluminium Factory)లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఎస్పీ మనోజ్ రతన్ చోటే తెలిపిన వివరాల ప్రకారం.. హజారీబాగ్ జిల్లాలోని దుమోదిహ్ వద్ద అల్యూమినియం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఇవి అంతకంతకు పెరిగి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు.


మృతులను బీహార్‌(Bihar)లోని గయా జిల్లాకు చెందిన దిహూరి నివాసి రంజీత్ ఠాకూర్ (26), సుఖ్‌దేవ్ సాహు (48)గా గుర్తించారు. కార్మికులు స్క్రాప్‌ను కరిగిస్తుండగా, బాయిలర్‌కు సమీపంలో మంటలు చెలరేగి మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం జరిగిందని పలువురు చెప్పారు. “పేలుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, ఫ్యాక్టరీ ఇనుప షీట్ పైకప్పు ఎగిరిపోయింది. బాయిలర్‌కు దగ్గరగా ఉన్న గోడ 10 చదరపు అడుగుల మేర ధ్వంసం అయింది. సమీపంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా కూలీలు ఆ తాకిడికి స్పృహ కోల్పోయారు” అని వివరించారు.

Updated Date - 2023-09-22T18:14:17+05:30 IST