Home » Jharkhand
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో బీజేపీ..దాని మిత్ర పక్షాలదే హవా అని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటలతో, జార్ఖాండ్‌లో సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అప్పటి వరకూ జరిగిన పోలింగ్ శాతం ప్రకారం మహారాష్ట్రలో 58.22 శాతం, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, జార్ఖాండ్‌లో రెండో విడతగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పూట పోలింగ్ తక్కువగా నమోదైంది. మహారాష్ట్రలో ఉదయం 9 కేవలం 6.61 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది.
జార్ఖాండ్‌లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్‌దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.
జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.