Share News

Students: ఈ ఏడాది ఒకే చోట అత్యధిక ఆత్మహత్యలు జరిగింది ఎక్కడంటే...

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రమేష్‌కి ఈ ఏడాది విషాదాన్ని మిగిల్చింది. అతని పెద్దకొడుకు రాజస్థాన్ లోని కోటాలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారాడు. ఈ ఏడాది కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.

Students: ఈ ఏడాది ఒకే చోట అత్యధిక ఆత్మహత్యలు జరిగింది ఎక్కడంటే...

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రమేష్‌కి ఈ ఏడాది విషాదాన్ని మిగిల్చింది. అతని పెద్దకొడుకు రాజస్థాన్ లోని కోటాలో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారాడు. ఈ ఏడాది కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వీరిలో రమేష్ కుమారుడు కూడా ఒకరు. ఇప్పటివరకు కోటాలో అత్యధిక మరణాల సంఖ్య ఇదే.

2022లో 15 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. వీటిని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. హాస్టళ్లలో స్ప్రింగ్‌లతో కూడిన ఫ్యాన్లు,బాల్కనీ, లాబీల్లో ఇనుమ మెష్ లు ఏర్పాటు చేశారు.


పై నుంచి దూకినా గాయపడకుండా వలలు ఉంచారు. మానసిక వేధనకు గురికాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. నీట్, జేఈఈ(NEET, JEE)ల్లో అత్యున్నత ప్రమాణాలతో ట్రైనింగ్ ఇచ్చేందుకు కోటా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడికి దేశ నలుమూలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ట్రైనింగ్ కోసం వస్తుంటారు. వారంతా అక్కడే ఉన్న హాస్టళ్లలో నివసిస్తుంటారు. అయితే చదువుల్లో ఒత్తిడి తదితర కారణాల వల్ల కొన్నేళ్లుగా కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 31 , 2023 | 12:58 PM