Titanosaur eggs : మధ్యప్రదేశ్‌లో 256 టైటానోసార్‌ గుడ్లు

ABN , First Publish Date - 2023-01-22T00:39:51+05:30 IST

ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై సంచరించినట్టు భావిస్తున్న టైటానోసార్ల 256 శిలాజ గుడ్లను శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్‌లో గుర్తించారు.

Titanosaur eggs : మధ్యప్రదేశ్‌లో 256 టైటానోసార్‌ గుడ్లు

ఇండోర్‌, జనవరి 21: ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై సంచరించినట్టు భావిస్తున్న టైటానోసార్ల 256 శిలాజ గుడ్లను శాస్త్రవేత్తలు మధ్యప్రదేశ్‌లో గుర్తించారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన పరిశోధక బృందం ధార్‌ జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుడ్లు బయటపడ్డాయి. ఇవి 6.6 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్‌ జాతికి చెందిన టైటానోసార్‌ గుడ్లని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టైటానోసార్‌లు ఒక విడతలో పెట్టిన గుడ్లను ఒక గుంతలో పాతిపెట్టడం వల్ల వాటి షెల్స్‌ ఒక దానిలో ఒకటి ఇరుక్కున్నట్టు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. టైటానోసౌరిడ్‌ సౌరోపాడ్‌ కుటుంబానికి చెందిన డైనోసార్లు ఇప్పటివరకు ఈ భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి.

Updated Date - 2023-01-22T00:40:04+05:30 IST