Israel vs Palestine:ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-10-08T15:49:22+05:30 IST

ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్‌కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది

Israel vs Palestine:ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ: ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్‌కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. బాధితులు.. అకస్మాత్తుగా చెలరేగిన హింసతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని అధికారులకు గోడు వెల్లబోసుకున్నారు. తమను త్వరగా రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇజ్రాయెల్ అధికారుల సూచనల్ని పాటిస్తున్నప్పటికీ.. అక్కడ గడపాలంటే భయంగా ఉంటోందని వాపోతున్నారు. మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మా మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ.. జెరూసలెం(Jerusalem)లో చిక్కుకుపోయిన ప్రజలను సేఫ్ గా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు.


ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 600కు చేరింది. శనివారం ఉదయం నుంచి ఈ ఘర్షణలు జరుగుతుండగా.. పరస్పర దాడుల్లో ఆయా ప్రాంతాలు తీరని ఆస్తి, ప్రాణ నష్టాన్ని చవి చూస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం, స్డెరోట్, కిబ్బట్జ్ నిర్ యామ్ వంటి ప్రాంతాల్లో రాకెట్ సైరన్‌లు మోగిస్తున్నారు.

Updated Date - 2023-10-08T15:51:00+05:30 IST