Home » Meghalaya
పుట్టిన ప్రతి మనిషికీ తప్పకుండా పేరుంటుంది. ఇదే అందరి నమ్మకం. కానీ, ఓ వింత గ్రామంలో ఎవరికీ పేర్లు ఉండవు. మరి, వాళ్లు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..
మేఘాలయలోని ప్రకృతి అందాలు తనను కట్టిపడేశాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజధాని షిల్లాంగ్‌లోని ఖాసీ గిరిజన నృత్యం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందన్నారు. వారసత్వం, పట్టుదలకు ఈ నృత్యం గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఖాసీ ప్రజల ఆతిథ్యం.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటని ఆయన అభివర్ణించారు.
మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి మరి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం.
కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్‌కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది
సోమవారం సాయంత్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైనట్టు తేలింది. దీంతో.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే.. ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై...
భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్, మేఘాలయ, పుదిచ్చేరికి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్‌థోమి, మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.