Share News

Jammu Kashmir: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 38 మంది మృతి

ABN , First Publish Date - 2023-11-15T15:11:00+05:30 IST

జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Jammu Kashmir: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 38 మంది మృతి

జమ్మూ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్త్వర్ నుంచి జమ్మూ కశ్మీర్‌కు 60 మంది ప్రయాణికులతో ఓ బస్సు బయల్దేరింది. బటోట్-కిష్త్వర్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపానికి రాగానే పక్కనే 300 అడుగుల లోతులో ఉన్న లోయలోకి బస్సు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మ‌‌‌ృతదేహాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.


వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ(PM Modi) సంతాపం తెలిపారు. మ‌తుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha) సంతాపం తెలిపారు. “దోడాలోని అస్సర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన వైద్యా సాయాన్ని అందించాల్సిందిగా డివికామ్ & డిస్ట్రిక్ట్ అడ్మిన్‌ను ఆదేశించాం” అని మనోజ్ చెప్పారు. దోడా జిల్లాలో వారం రోజుల్లో ఇది రెండో రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం.

Updated Date - 2023-11-15T15:11:01+05:30 IST