Share News

Tunnel Workers: కాసేపట్లో సొరంగం నుంచి బయటకు రానున్న 41 మంది కార్మికులు

ABN , First Publish Date - 2023-11-23T11:38:28+05:30 IST

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 11వ రోజుకు చేరుకున్న రిస్క్యూ మిషన్ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Tunnel Workers: కాసేపట్లో సొరంగం నుంచి బయటకు రానున్న 41 మంది కార్మికులు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. 11వ రోజుకు చేరుకున్న రెస్క్యూ మిషన్ పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి. సొరంగంలో కార్మికులు ఉన్న ప్రాంతానికి చేరుకోవడమే లక్ష్యంగా మంగళవారం రాత్రి నుంచి పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 800 మిల్లీ మీటర్ల వ్యాసార్థమున్న స్టీల్ పైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా ప్రవేశపెడుతున్నారు. ఇంకా 12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉంది. కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద 41 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అన్ని అంబులెన్సులలో వైద్య బృందం సిద్ధంగా ఉంది. మరో ఒకటి, రెండు గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఉత్తరాఖండ్‌‌లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో 41 మంది చిక్కుకుపోయారు. నవంబర్ 12 నుంచి కార్మికులు టన్నెల్‌లోనే ఉన్నారు. 13 రోజుల నుంచి టన్నెల్ లోపలనే ఉండి పోయారు. ఇండియాలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌గా అధికారులు పేర్కొన్నారు.

నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో మట్టి ఒక్కసారిగా కూలింది. ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా సహాయంతో, చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను అధికారులు చూశారు. కార్మికులను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఇంటర్నేషల్ టన్నెల్ ఎక్సఫర్ట్స్ ఆర్నాల్డ్ డిక్స్ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Updated Date - 2023-11-23T11:53:46+05:30 IST