Rajasthan: ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2023-10-01T12:40:19+05:30 IST

ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న గుట్టు రట్టు చేశారు రాజస్థాన్(Rajasthan) పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.కోటి 5 లక్షల విలువైన 8 కిలోల బరువున్న ఏనుగు దంతాన్ని(elephant tusk) ఉదయ్ పుర్‌కి కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రణాళిక వేశారు. అనంతరం వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Rajasthan: ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

జైపుర్: ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న గుట్టు రట్టు చేశారు రాజస్థాన్(Rajasthan) పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.కోటి 5 లక్షల విలువైన 8 కిలోల బరువున్న ఏనుగు దంతాన్ని(elephant tusk) ఉదయ్ పుర్‌కి కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రణాళిక వేశారు. అనంతరం వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.


ఈ ముఠాలో సీఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ తో పాటు మరో అయిదుగురు ఉన్నారు. వీరిని శనివారం ఉదయ్ పుర్(Udaypur) పోలీసులు అరెస్ట్ చేశారు. దంతాన్ని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నుంచి ఉదయ్ పుర్ లోని కొనుగోలుదారుడికి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో CRPF సబ్-ఇన్‌స్పెక్టర్ రాహుల్ మీనా గాడి, అమృత్ సింగ్ గుర్జార్, దోసా నివాసి, అర్జున్ సింగ్ మీనా, సంజయ్ సింగ్ మీనా, రీతా షా ఉన్నారు. ఈ ఘటన తాలూకు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-10-01T12:40:19+05:30 IST