5 State election: మోగిన నగారా.. తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2023-10-09T12:38:41+05:30 IST
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు. ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం) అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్, 2023న (ఆదివారం) జరుగుతుందన్నారు.
ఇక రాజస్థాన్‌కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం అదనంగా 1.01 లక్షల బూత్‌లకు వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.
మొత్తం 5 రాష్ట్రాల్లో 8.2 కోట్ల పురుష, 7.8 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నాయి. ఇందులో 60.2 లక్షల కోట్ల ఓటర్లు ఉన్నారని కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికం.
ఐదు రాష్ట్రాలలో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ఈసీ.
పట్టణ ప్రాంతాలలో 14,484 పోలింగ్ స్టేషన్లు.
గ్రామీణ ప్రాంతాలలో 20,892 పోలింగ్ స్టేషన్లు
తెలంగాణలో తొలగించిన ఓట్లు 6,10,694.
తెలంగాణలో లింగ నిష్పత్తి 998.
తెలంగాణలో 35,356 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు.
మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుంది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ - జనవరి 3న
మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ - జనవరి 8న
రాజస్థాన్ అసెంబ్లీ గడువు ముగింపు తేదీ- జనవరి 14న
తెలంగా అసెంబ్లీ గడువు ముగింపు తేదీ - జనవరి 18న.
5 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు
మధ్యప్రదేశ్ - 230 సీట్లు
ఛత్తీస్‌గఢ్ - 90 సీట్లు
రాజస్థాన్ - 200 సీట్లు
తెలంగాణ - 119 సీట్లు
మిజోరం - 90 సీట్లు.