Share News

ఉత్తరకాశీలో కూలీల చెంతకు 6 అంగుళాల పైప్‌

ABN , First Publish Date - 2023-11-21T04:06:55+05:30 IST

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీలో చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కూలీల చెంతకు ప్రత్యామ్నాయంగా సోమవారం 6 అంగుళాల వెడల్పాటి పైప్‌ను పంపారు.

ఉత్తరకాశీలో కూలీల చెంతకు 6 అంగుళాల పైప్‌

న్యూఢిల్లీ, ఉత్తరకాశీ, నవంబరు 20: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తరకాశీలో చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కూలీల చెంతకు ప్రత్యామ్నాయంగా సోమవారం 6 అంగుళాల వెడల్పాటి పైప్‌ను పంపారు. శిథిలాల నుంచి 53 మీటర్ల మేర చొప్పించిన ఈ పైప్‌తో రోటీ, సబ్జీ వంటివాటిని ప్లాస్టిక్‌ సీసాల్లో పంపనున్నారు. సోమవారం మూంగ్‌ కిచిడీని చేరవేశారు. చార్జర్‌తో కూడిన ఫోన్‌నూ పంపారు. 8 రోజుల నుంచి సాగుతున్న సహాయ చర్యల్లో ఇది కీలక పురోగతి అని అధికారులు పేర్కొన్నారు. కొత్త పైప్‌తో.. కూలీల నుంచి సమాచారం వచ్చేందుకు అవకాశం ఉందని వివరించారు. నాలుగైదు రోజుల్లో ఫలితం వస్తుందని కేంద్ర ప్రభుత్వం పంపిన బృందంలోని సభ్యుడు, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఓఎస్డీ, ప్రధాని మాజీ సలహాదారు భాస్కర్‌ ఖుల్బే పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T07:30:05+05:30 IST