Sarpanch: మేనల్లుడి పెళ్లిలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఊహించని పని... పెళ్లికి వచ్చినవారంతా షాక్...

ABN , First Publish Date - 2023-02-19T11:56:32+05:30 IST

పెళ్లి అంటే నూరేళ్ల పంట. అందుకే శక్తి మేరకు వేడుకగా జరుపుకుంటారు. కొందరు ఆ వేడుకను అనేక మందికి ఉపయోగపడేవిధంగా, గుర్తుంచుకునే విధంగా చేసుకుంటారు.

Sarpanch: మేనల్లుడి పెళ్లిలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఊహించని పని... పెళ్లికి వచ్చినవారంతా షాక్...
Gujarat

మెహసానా (గుజరాత్) : పెళ్లి అంటే నూరేళ్ల పంట. అందుకే శక్తి మేరకు వేడుకగా జరుపుకుంటారు. కొందరు ఆ వేడుకను అనేక మందికి ఉపయోగపడేవిధంగా, గుర్తుంచుకునే విధంగా చేసుకుంటారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ తన మేనల్లుడి వివాహ మహోత్సవంలో అలాగే చేశారు.

గుజరాత్‌లోని కేక్రి తహశీలులో ఉన్న అగోల్ గ్రామ మాజీ సర్పంచ్ కరీం యాదవ్ తన మేనల్లుడి వివాహ మహోత్సవంలో రూ.500 నోట్లను వెదజల్లారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా సంతోషంగా వాటిని తీసుకున్నారు.

కరీం మేనల్లుడు రజాక్ వివాహం సందర్భంగా ఊరేగింపు జరుగుతుండగా, కరీం, ఆయన కుటుంబ సభ్యులు మేడ మీదకు వెళ్లి రూ.500 నోట్లను క్రిందకు వెదజల్లారు. దీంతో ఈ ఊరేగింపులో పాల్గొన్నవారంతా తమపై అదృష్ట దేవత కరుణ చూపిందంటూ, సంతోషంగా ఆ నోట్లను తీసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి :

Turkey earthquake: భూకంపం తర్వాత టర్కీలో ఓ గ్రామం ఏమైపోయిందో తెలుసా?... దడ పుట్టించే విషయాలు వెలుగులోకి...

Baheswar Dham : ధీరేంద్ర శాస్త్రికి ముస్లిం మత పెద్దల షాక్

Updated Date - 2023-02-19T12:07:36+05:30 IST