Odisha train accident: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అదానీ భరోసా

ABN , First Publish Date - 2023-06-04T18:14:02+05:30 IST

ఒడిశాలోని బాలాసార్‌లో మూడు రైళ్లు ఢీకొని 275 మంది మృత్యువాత పడటం, మరో 700 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారత ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించారు. వారి చదువులు తాము చూసుకుంటామని ఒక ట్వీట్‌లో తెలిపారు.

Odisha train accident: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అదానీ భరోసా

న్యూఢిల్లీ: ఒడిశా(Odisha)లోని బాలాసార్‌లో మూడు రైళ్లు ఢీకొని 275 మంది మృత్యువాత పడటం, మరో 700 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారత ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ (Goutam Adani) ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించారు. వారి చదువులు తాము చూసుకుంటామని ఒక ట్వీట్‌లో తెలిపారు.

''ఒడిశా దుర్ఘటన మనందరినీ తీవ్ర విచారంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ చేపట్టాలని నిర్ణయించాం. బాధితులు, వారి కుటుంబాలకు చేయూత నివ్వడం, పిల్లల రేపటి భవిష్యత్తకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది'' అని అదానీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజకీయాల తరుణం కాదిది: అనురాగ్ ఠాకూర్

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై జరుగుతోందని, ప్రస్తుతం క్షతగాత్రులకు అన్నిరకాల వైద్యసాయం అందించడంపై తాము దృష్టిసారించామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. కటక్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని, అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తరుణంలో దీనిపై రాజకీయాలు చోటుచేసుకోరాదని అన్నారు. యావద్దేశం ఏకతాటిపైకి వచ్చి ఆదుకోవాల్సిన సమయం ఇదని చెప్పారు.

Updated Date - 2023-06-04T18:17:26+05:30 IST