Adipurush: ‘ఆదిపురుష్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ విషయంలోనూ వివాదమే!

ABN , First Publish Date - 2023-06-21T21:36:03+05:30 IST

సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న 'ఆది పురుష్' టీమ్ ఎట్టకేలకు 'గుడ్ న్యూస్' న్యూస్ చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అయితే.. ఈ విషయంలో కూడా వివాదం తొంగిచూసింది.

Adipurush: ‘ఆదిపురుష్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ విషయంలోనూ వివాదమే!
Adipurush Still

ముంబై: సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న 'ఆది పురుష్' (Adipurush) టీమ్ ఎట్టకేలకు 'గుడ్ న్యూస్' చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్‌కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ (Special Offer) ప్రకటించింది. అయితే.. ఈ విషయంలో కూడా వివాదం తొంగిచూసింది.

రూ.150 కే టిక్కెట్...

అందరికీ అందుబాటులో ఉండేలా రూ.150 నుంచి టిక్కెట్ ఆఫర్‌ను ఆదిపురుష్ నిర్మాతలు ప్రకటించారు. ఈనెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని చెబుతూనే...ఓ మెలిక పెట్టింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆఫర్ వర్తించదని ప్రకటించింది. స్పెషల్ ఆఫర్ అంటూనే... ఆ నాలుగు తప్ప...అంటూ ప్రకటించడం వెనుక మెలిక ఏమిటో 'ఆదిపురుష్' సృష్టికర్తలే (నిర్మాతలు) చెప్పాలంటూ నెటిజన్లు మళ్లీ కామెంట్లు గుప్పిస్తున్నారు.

Adipurush.jpg

ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్, దేవ్‌దత్తా నగే కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మనోజ్ ముంతాషిర్ సంభాషణలు అందించగా, టీ సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకత్వంలో ఈనెల 16న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Updated Date - 2023-06-21T21:40:16+05:30 IST