Share News

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే?

ABN , First Publish Date - 2023-11-30T21:48:24+05:30 IST

గురువారం (30/11/23) సాయంత్రం ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాగా.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఆ రిజల్ట్స్ పేర్కొంటున్నాయి. 2003 నుంచి ఆ రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి...

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే?

Madhya Pradesh Exit Poll: గురువారం (30/11/23) సాయంత్రం ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాగా.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఆ రిజల్ట్స్ పేర్కొంటున్నాయి. 2003 నుంచి ఆ రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి ఈసారి కాంగ్రెస్ నుంచి భారీ షాక్ తగలొచ్చని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మూడు ఎగ్జిట్ పోల్స్ ఏమో రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌తో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే.. మరో మూడు ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పేర్కొంటున్నాయి.

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా.. కాంగ్రెస్‌కు 68-90 మధ్య సీట్లు వస్తే, బీజేపీ 140-162 సీట్లతో విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. ఇండియా టీవీ - సీఎన్‌ఎక్స్ కూడా బిజెపికి విజయాన్ని అందజేస్తుందని తెలిపింది. ఆ పార్టీ 140-159 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 70-89 మధ్య పరిమితం అవుతుందని తెలిపింది. రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ అయితే.. బీజేపీ 118 నుంచి 130 మధ్య సీట్లు.. కాంగ్రెస్ 97-107 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పింది. TV9 భారత్‌వర్ష్ - పోల్‌స్ట్రాట్ అంచనా మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 111-121 స్థానాలు గెలవొచ్చని, బీజేపీకి 106-116 సీట్లే వస్తాయని వెల్లడించింది.


దైనిక్ భాస్కర్ చేసిన సర్వే కూడా కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యాన్ని అందించింది. ఆ పార్టీ 105-120 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 95-115 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. ఇతర పార్టీల సంఖ్య 0-15 వరకు ఉంటుందని.. ఒకవేళ BJP లేదా కాంగ్రెస్‌లకు మెజారిటీ తక్కువగా వస్తే ఆ స్థానాలు కీలక పాత్ర పోషించవచ్చని సూచించింది. టైమ్స్ నౌ - ఈటీజీ (కాంగ్రెస్‌: 109-125 సీట్లు, బీజేపీ: 105-117)తో పాటు జన్ కీ బాత్ (కాంగ్రెస్:102-125, బీజేపీ:100-123) ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే.. కౌంటింగ్‌లో రిజల్ట్స్ ఎలాగైనా రావొచ్చని తేల్చి చెప్తున్నాయి. అంటే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని పేర్కొంటున్నాయి.

ఏదిఏమైనా.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కచ్ఛితమని ఏమాత్రం చెప్పలేం. కొన్నిసార్లు ఈ లెక్కలు తప్పుగా తేలుతాయి. కాబట్టి.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చేవరకూ ఏ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది పక్కాగా చెప్పలేం. రెండింటి మధ్య తీవ్ర పోటీ ఉంది కాబట్టి.. ఎవరు అధికారంలోకి వస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఒకవైపు బీజేపీ ఏమో తామే తిరిగి అధికారంలోకి వస్తామని వాదిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2023-11-30T21:48:26+05:30 IST