After Joshimath: రుద్రప్రయాగ్,కర్ణప్రయాగ్ ఇళ్లలోనూ పగుళ్లు
ABN , First Publish Date - 2023-02-01T08:45:04+05:30 IST
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌లోనే కాదు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్ నగరాల్లోనూ ఇళ్లలో పగుళ్లు...
రుద్రప్రయాగ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌లోనే కాదు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్ నగరాల్లోనూ ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి.(Cracks appear in houses) ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణం జోషిమఠ్‌లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి.(After Joshimath)రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఇళ్ల పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపర్యాగ్ జిల్లాలోని మరోడా గ్రామంలోను ఇళ్లు కూలిపోయాయి.పౌరీ, బాగేశ్వర్, ఉత్తరకాశీ, తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్(Rudraprayag,Karnaprayag) నగరాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి.ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తెహ్రీ జిల్లా నరేంద్రనగర్ నియోజకవర్గం అటాలీ గ్రామం మీదుగా వెళ్లే రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం స్థానిక ప్రజలకు కష్టాలను పెంచింది. అటలీకి ఒక చివర కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. గ్రామంలోని మరో చివర సొరంగం బ్లాస్టింగ్ పనుల వల్ల కూడా ఇళ్లకు భారీగా పగుళ్లు ఏర్పడుతున్నాయి.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు వల్ల అటలీతోపాటు గులార్, వైసి, కౌడియాల, మలేత గ్రామాల్లో కూడా ఇళ్లు పగుళ్ల బారిన పడుతున్నాయి. తమకు పునరావాసం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. రైలు మార్గం నిర్మాణం కోసం బ్లాస్టింగులు చేయడం వల్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆశిష్ విహార్ నివాసి పిఎల్ ఆర్య తెలిపారు.