Air India: కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కి డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పటినుంచంటే?
ABN , First Publish Date - 2023-10-04T18:02:46+05:30 IST
దేశం నుంచి వివిధ ప్రాంతాల మధ్య సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా(Air India) తాజాగా మరో రెండు ఏరియాల మధ్య నాన్ స్టాప్ సర్వీస్(Non Stop Service) ను పరిచయం చేయనుంది. ఎయిర్ లైన్ అధికారిక ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 23 నుంచి కోల్‌కతా(Kolkata) నుంచి బ్యాంకాక్(Bankok) మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా నడపనుంది.
కోల్‌కతా: దేశం నుంచి వివిధ ప్రాంతాల మధ్య సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా(Air India) తాజాగా మరో రెండు ఏరియాల మధ్య నాన్ స్టాప్ సర్వీస్(Non Stop Service) ను పరిచయం చేయనుంది. ఎయిర్ లైన్ అధికారిక ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 23 నుంచి కోల్‌కతా(Kolkata) నుంచి బ్యాంకాక్(Bankok) మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా నడపనుంది.
AI321 విమానం కోల్‌కతాలో రాత్రి 10 గంటలకు బయల్దేరి, బ్యాంకాక్‌లో మరుసటి రోజు మధ్యాహ్నం 02.05 నిమిషాలకు చేరుకోనుంది. తిరిగి మధ్నాహ్నం 03.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 04.10 గంటలకు చేరుకుంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులపాటు ఇది నిరంతరంగా సేవలందించనుంది. ఎయిర్ ఇండియా ప్రస్తుతం బ్యాంకాక్‌కు వారానికి 14 విమానాలను నడుపుతోంది. ఢిల్లీ, ముంబయి మధ్య రోజూవారీగా నాన్‌స్టాప్ సేవలు అందిస్తోంది. ఇది ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌కి సైతం విమానాల్ని నడుపుతోంది. ఈ ఏడాది 4 వేల 200 మంది క్యాబిన్ క్రూ ట్రైనీలను, 900 మంది పైలట్‌లను నియమించుకోవాలని చూస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. 2022 నుంచి 2023 వరకు దాదాపు 2 వేల మంది క్యాబిన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.