Share News

సంపదంతా సంరక్షకుడికే!

ABN , First Publish Date - 2023-12-10T03:14:11+05:30 IST

ఆయన స్విట్జర్లాండ్‌ సంపన్నుల్లో ఒకరు. వివాహం చేసుకోలేదు. వారసుల్లేని ఆయ న సంపాదనను తన తదనంతరం తనను కంటికి రెప్పలా చూసుకున్న మాజీ సంరక్షకుడిని దత్తత తీసుకుని ఆయనకు రాసిచ్చేయాలని భావిస్తున్నారు.

సంపదంతా సంరక్షకుడికే!

రూ.95వేల కోట్ల ఆస్తి ఇవ్వనున్న స్విట్జర్లాండ్‌ కుబేరుడు

దత్తత తీసుకుని రాసివ్వనున్న బిలియనీర్‌ నికోలస్‌ ప్యూచ్‌

స్విట్జర్లాండ్‌, డిసెంబరు 9: ఆయన స్విట్జర్లాండ్‌ సంపన్నుల్లో ఒకరు. వివాహం చేసుకోలేదు. వారసుల్లేని ఆయ న సంపాదనను తన తదనంతరం తనను కంటికి రెప్పలా చూసుకున్న మాజీ సంరక్షకుడిని దత్తత తీసుకుని ఆయనకు రాసిచ్చేయాలని భావిస్తున్నారు. ఆ కుబేరుడు నికోలస్‌ ప్యూచ్‌ (80). ఆయన దత్తత తీసుకోవాలనుకుంటున్న సంరక్షకుడి వయసు 51 ఏళ్లు. ఆయనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నట్టు స్విస్‌ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇక నికోలస్‌ ఆస్తి విలువ ఎంతంటే 1,140 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.95,076 కోట్లు). ఈయన స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్యాషన్‌ ఉత్పత్తుల దిగ్గజం హెర్మె్‌సను స్థాపించిన థియెర్రీ హెర్మెస్‌ మనవడు. హెర్మె్‌సలో ఈయనకు 5-6 శాతం వాటా ఉంది. ఆయితే తన సంపదను తన సంరక్షుడికే ఇవ్వాలని నిర్ణయించుకుని ఇందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను ప్రారంభించాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నికోలస్‌ తన సంరక్షకుడికి మార్రకేశ్‌, మొరాకో, మాంట్రియక్స్‌ లోని తన ఆస్తులకు సంబంధించిన తాళాలను ఇచ్చేసినట్టు కూడా కథనాలు వస్తున్నాయి. ఈ ఆస్తుల విలువ 5.9 మిలియన్‌ డాలర్లు ఉందట.

Updated Date - 2023-12-10T03:14:11+05:30 IST