Amul milk: నేటినుంచి అమూల్ పాల ధరలు పెంపు...లీటరుపై రూ.3 భారం
ABN , First Publish Date - 2023-02-03T09:43:21+05:30 IST
గుజరాత్ సహకార డెయిరీ అయిన అమూల్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది...
న్యూఢిల్లీ: గుజరాత్ సహకార డెయిరీ అయిన అమూల్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై మూడు రూపాయలు పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది.(Gujarat dairy co-operative Amul) అమూల్ గోల్డ్ పాలు లీటరు ధర 66రూపాయలకు పెంచింది.(Hike) అమూల్ తాజా పాలు లీటరు ధర రూ.54, అమూల్ ఆవు పాలు లీటరు ధర రూ.56, అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు 70రూపాయలకు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Assam: 18 ఏళ్లు నిండకముందే బాలికలు గర్భం దాలిస్తే భర్తలపై పోక్సో కేసులు
శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరల జాబితాను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే విడుదల చేశారు. అమూల్ పాల ధరలను గత ఏడాది అక్టోబరులో రెండు రూపాయలు పెంచింది. పాల ఉత్పత్తి వ్యయంతోపాటు డెయిరీ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల పాల ధరల పెంచామని అమూల్ డెయిరీ తెలిపింది. కేవలం పశువుల దాణా వ్యయం(cattle feeding cost) 20 శాతం పెరిగిందని అమూల్ వివరించింది.