Himanta Biswa Sarma: ప్రకంపనలు రేపుతోన్న సీఎం ప్రకటన

ABN , First Publish Date - 2023-03-17T21:37:04+05:30 IST

అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన ప్రకటన చేశారు.

Himanta Biswa Sarma: ప్రకంపనలు రేపుతోన్న సీఎం ప్రకటన
Himanta Biswa Sarma

డిస్‌పూర్: అస్సాం(Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన ప్రకటన చేశారు. అస్సాం రాష్ట్రంలోని జిల్లాల మధ్య(Inter District competition) పరిశుభ్రతపై స్వచ్ఛతా(Swachhata) పోటీలు పెట్టనున్నారు. కాంపిటీషన్‌లో విజేతగా నిలిచిన జిల్లాకు వంద కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించనున్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఆ నిధులు ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు ఖుమ్‌తాయ్(Khumtai assembly constituency) నియోజకవర్గంలోని జడ్‌పీసీ ప్రాంతంలోని గ్రామాల మధ్య, టీ గార్డెన్‌ల మధ్య కూడా స్వచ్ఛతకు సంబంధించిన పోటీ ప్రకటించారు. ఈ పోటీల ద్వారా అస్సాం దేశంలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వచ్ఛతా పోటీలపై బ్లూ ప్రింట్ కూడా విడుదల చేయనున్నారు. స్వచ్ఛతా పోటీల ద్వారా పర్యాటకంగా కూడా తమ రాష్ట్రానికి మేలు చేకూరుతుందని శర్మ చెబుతున్నారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య, నగరాల పోటీ పెట్టి పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. స్వచ్ఛభారత్‌ ఉద్యమంపై అన్ని రాష్ట్రాల్లోనూ అవగాహన పెరిగింది.

Updated Date - 2023-03-17T21:38:24+05:30 IST