Assam : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తాం : హిమంత బిశ్వ శర్మ
ABN , First Publish Date - 2023-05-09T20:52:12+05:30 IST
బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.
న్యూఢిల్లీ : బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు. ఈ చర్య తీసుకోవడం చట్టబద్ధంగా చెల్లబాటు అవుతుందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. బహుభార్యత్వంపై నిషేధం విధించే అధికారం శాసన సభకు ఉందా? లేదా? అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.
ముస్లిం వ్యక్తిగత (షరియా) చట్టం, 1937, భారత రాజ్యాంగంలోని అధికరణ 25, ఆదేశిక సూత్రాలను క్షుణ్ణంగా ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. సంబంధిత అన్ని వర్గాలతోనూ, అదే విధంగా న్యాయ నిపుణులతోనూ కూడా విస్తృతంగా చర్చలు జరుపుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి, ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బహుభార్యత్వాన్ని నిర్మూలించేందుకు ఉమ్మడి పౌర స్మృతి కోసం అస్సాం ప్రభుత్వం ఎదురు చూడదని, రాష్ట్ర చట్టం ద్వారానే దీనికి తెర దించాలని కోరుకుంటోందని చెప్పారు.
హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో బాల్య వివాహాలకు తెర దించేందుకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. బాల్య వివాహాల నిషేధ చట్టం, లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ చట్టం ప్రకారం సుమారు 3,000 మందిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :
Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..
Indian Army : సైన్యంలో యూనిఫాం సంస్కరణలు