Share News

Aydoya: అయోధ్య విమానాశ్రయం ప్రత్యేకతలు మీకు తెలుసా? చూస్తే అబ్బురపడతారు

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:29 PM

ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో అయోధ్య రామమందిర(Ayodya Ram Mandir) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా యోగీ సర్కార్ భారీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసింది.

Aydoya: అయోధ్య విమానాశ్రయం ప్రత్యేకతలు మీకు తెలుసా? చూస్తే అబ్బురపడతారు

అయోధ్య: ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో అయోధ్య రామమందిర(Ayodya Ram Mandir) ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా యోగీ సర్కార్ భారీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చైర్మన్ సంజీవ్ కుమార్ 20 నెలల రికార్డు సమయంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు.

గతేడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయోధ్య విమానాశ్రయాన్ని(Ayodya Airport) అభివృద్ధి చేసింది.ఇందుకోసం ప్రభుత్వం 821 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొత్తంగా రూ.350 కోట్లు ఎయిర్ పోర్ట్ కట్టడానికి వెచ్చించారు. అయోధ్య చరిత్ర, ప్రాముఖ్యతను తెలియజేసేలా నిర్మాణం ఉంది. రాముడి కళాఖండాలు, పెయింటింగ్ లు, కుడ్య చిత్రాలతో లోపలి భాగాలను అలంకరించారు.


ఏటీసీ టవర్, అగ్నిమాపక కేంద్రం, కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. టెర్మినల్ బిల్డింగ్ లో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్ ఈడీ లైటింగ్, ఫౌంటెన్లు, సౌర విద్యుత్తు ప్లాంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సదుపాయాలు ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే పొడవు 2200 మీటర్లు. ఇక్కడ A-321 విమానాలను కూడా ఆపరేట్ చేయొచ్చు. రెండో దశ విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా 50వేల చదరపు మీటర్ల కొత్త టర్మినల్ భవనాలు నిర్మిస్తారు.

ఎయిర్ పోర్ట్ రద్దీ సమయాల్లో గరిష్ఠంగా 4వేల మంది ప్యాసింజర్లకు సేవలందించగలదు. రెండో దశ పూర్తయిన తర్వాత ఏటా 60 లక్షల మందికి సరిపడా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ విమానాశ్రయం అభివృద్ధితో రామ మందిరాన్ని సందర్శించే యాత్రికులు రామ్ కి పైడి, హనుమాన్ గర్హి, నాగేశ్వర్ నాథ్ ఆలయం, బిర్లా ఆలయం వంటి ప్రసిద్ధ యాత్రా స్థలాలతో కనెక్టివిటీ పొందుతారు. కొత్త పర్యాటకుల రాకతో ఆ రంగం అభివృద్ధి జరుగుతుంది. అయోధ్య ప్రాంతం మహా నగరంగా అవతరించే అవకాశమూ లేకపోలేదు.

Updated Date - Dec 30 , 2023 | 02:29 PM