Share News

Bethlehem : శాంతిదూత జన్మస్థలం.. నేడు యుద్ధానికి నిలయం

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:57 AM

‘‘బెత్లెహాంలో ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచశాంతికి సందేశం. కానీ, ఈరోజు బెత్లెహాం నగరం ప్రపంచంలోనే అత్యంత దుఖఃదాయకమైన ప్రదేశం’’ అని పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్నారు. శాంతిదూత

Bethlehem : శాంతిదూత జన్మస్థలం.. నేడు యుద్ధానికి నిలయం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధం వెంటనే ఆగాలి: పోప్‌ ఫ్రాన్సిస్‌

క్రిస్మస్‌ రోజున బోసిగా ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహాం

రోమ్‌, డిసెంబరు 25: ‘‘బెత్లెహాంలో ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచశాంతికి సందేశం. కానీ, ఈరోజు బెత్లెహాం నగరం ప్రపంచంలోనే అత్యంత దుఖఃదాయకమైన ప్రదేశం’’ అని పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్నారు. శాంతిదూత జన్మస్థలం యుద్ధానికి నిలయంగా మారిందన్నారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుధాల సంఘర్షణ కారణంగా బెత్లెహాంతో పాటు ప్రపంచంలోనే శాంతికి స్థానం లేకుండా పోయిందన్నారు. ఆయుధ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఎగదోస్తోందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాలిసికాలో మాట్లాడారు. ప్రపంచశాంతికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య యుద్ధం వెంటనే ఆగాలన్నారు. అర్మెనియా, అజర్‌బైజాన్‌, సిరియా, యెమెన్‌, దక్షిణ సూడాన్‌, కాంగో, కొరియా ద్వీపకల్పంలో యుద్ధాలు, ఘర్షణలను ప్రస్తావించారు. ఆయా దేశాలు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, క్రీస్తు జన్మస్థలమైన వెస్ట్‌బ్యాంక్‌లోని బెత్లెహాం యుద్ధం కారణంగా క్రిస్మస్‌ రోజున పూర్తిగా బోసిపోయింది. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ సోమవారం తన నివాసంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. క్రీస్తు తన జీవితం ద్వారా ఇతరుల పట్ల దయగా ఉండాలని, సేవ చేయాలన్న సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన... ఇటీవల కశ్మీర్‌లో అమరులైన నలుగురు జవాన్లను గుర్తు చేసుకున్నారు. సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు. ఏసుక్రీస్తు జీవిత సందేశం త్యాగమేనని గుర్తు చేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ గీతాలాపన కూడా చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 12:57 AM