Share News

Bihar CM Nitish Kumar : భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుంది

ABN , First Publish Date - 2023-11-08T01:06:18+05:30 IST

బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పెను వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళల గౌరవానికి భంగం కలిగేలా తీవ్రవివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు విద్యావంతులైతే జనాభా

Bihar CM Nitish Kumar : భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుంది

బిహార్‌ అసెంబ్లీ సాక్షిగా నితీశ్‌ వ్యాఖ్యలు

పట్నా, నవంబరు 7: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పెను వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళల గౌరవానికి భంగం కలిగేలా తీవ్రవివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందని చెబుతూ షాకింగ్‌ కామెంట్లు చేశారు. ‘షాదీకే బాద్‌ పురుష్‌ రోజ్‌ రాత్‌ కర్తేహేనా’ అని అంటూ.. భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసునంటూ ఓ ‘అనకూడని మాట’ అన్నారు. శృంగారం అంతా సరిగానే జరిగినా చివర్లో ‘బయటకు తీసేయాలి’ అనే విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నితీశ్‌ వ్యాఖ్యలకు పురుష ఎమ్మెల్యేలు ముసిముసిగా నవ్వుకుంటే.. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. నితీశ్‌ వాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు కాముకత, స్త్రీ ద్వేషంతో కూడినినవి అని.. మహిళలను తీవ్ర అవమానించేలా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్‌ వాడిన ‘పదజాలం’పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీశ్‌ ‘ఓ అసభ్యకరమైన నాయకుడు’ అని, ఇలాంటి వ్యక్తి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరని తూర్పారబట్టింది. మహిళలు విద్యావంతులైతే జనాభా అదుపులో ఉంటుందనే సందేశాన్ని నితీశ్‌ ‘అభ్యంతరకరమైన తీరు’లో కాకుండా చక్కని మాటలతో చెప్పాల్సిందని బీజేపీ నేత తారా కిషోర్‌ ప్రసాద్‌ అన్నారు. నితీశ్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే నితీశ్‌ మాటలను లైంగిక విద్య కోణంలోనే చూడాలని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ సమర్థించారు. నితీశ్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియ్‌సగా స్పందించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని తాఖీదు ఇచ్చింది.

Updated Date - 2023-11-08T01:06:32+05:30 IST