Bill Gates : బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు
ABN , First Publish Date - 2023-02-10T04:07:53+05:30 IST
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఒరాకిల్ సంస్థ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు.
ఒరాకిల్ మాజీ సీఈవో భార్యతో డేటింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 9: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఒరాకిల్ సంస్థ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు. మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌తో 27 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించానని 2021 మే నెలలో బిల్‌గేట్స్ ప్రకటించారు. మరోపక్క, మార్క్ హర్డ్ 2019లో కేన్సర్ వల్ల చనిపోయారు. గేట్స్, పౌలా మధ్య బంధం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతుందని వారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి డెయిలీ మెయిల్‌కు వెల్లడించారు.