Khushbu Sundar: ఖుష్బుకు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2023-02-27T15:15:32+05:30 IST

తమిళనాడు భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు లభించాయి.

Khushbu Sundar: ఖుష్బుకు కీలక బాధ్యతలు
Khushbu Sundar

న్యూఢిల్లీ: తమిళనాడు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌(Khushbu Sundar)కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి(National Commission for Women)గా నామినేట్ చేశారు. దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఆమె వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాలంటే ఆసక్తి ఉండటంతో 2010లో ఆమె డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత హస్తం పార్టీలో చేరారు. 2020 వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడి బొమ్మలున్న చీర ధరించడం ద్వారా అప్పట్లో కలకలం రేపారు. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంస్థలు రచ్చ చేశాయి కూడా.

ఖుష్బూ సుందర్‌ కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. బాగా మాట్లాడతారని పేరు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్‌ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. మహిళల సమస్యలపై మరింత ఫోకస్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఖుష్బూ అంటున్నారు. మహిళల జోలికి రాజకీయ పార్టీల నేతలు వస్తే ఊరికునేది లేదని ఆమె హెచ్చరించారు.

Updated Date - 2023-02-27T17:23:32+05:30 IST