Tomatoes: యూకే సూపర్‌మార్కెట్లలో టమాటా స్టాకులు ఖాళీ.. ఏంటా అని కారణాలు అన్వేషించగా...
ABN , First Publish Date - 2023-02-21T16:04:02+05:30 IST
బ్రిటన్ (Britain)లో టమాటాల కొరత విపరీతంగా ఉంది. దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికాలలో టమాటా సాగుకు ప్రతికూల పరిస్థితులు
లండన్ : బ్రిటన్ (Britain)లో టమాటాల కొరత విపరీతంగా ఉంది. దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికాలలో టమాటా సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం. అత్యధిక ఉష్ణోగ్రతలుగల వాతావరణం వల్ల టమాటాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది, ఆ తర్వాత అత్యంత శీతల వాతావరణం వల్ల పంట చేతికి రావడానికి పట్టే సమయం పెరిగింది.
శీతాకాలంలో టమాటాల కోసం బ్రిటన్ సాధారణంగా మొరాకో, స్పెయిన్ వంటి దేశాలపై ఆధారపడుతుంది. మొరాకోలో రైతులు శీతల వాతావరణం, భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. స్పెయిన్‌లో కూడా ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు నాలుగు వారాల నుంచి టమాటా పంట దెబ్బతింది. భారీ వర్షాల వల్ల బ్రిటన్‌కు రవాణా సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి.
దీంతో ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రముఖ మాల్స్‌లో కనీసం ఒక టమాటా అయినా కనిపించడం లేదని వాపోతున్నారు. అరమరాలన్నీ ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు. బ్రెగ్జిట్ బ్రిటన్ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూపర్‌మార్కెట్ మారిసన్స్ తన ఖాళీ టమాటా షెల్ఫ్‌లలో, ‘‘స్పెయిన్, మొరాకోలలో ప్రతికూల వాతావరణం వల్ల టమాటాలు అందుబాటులో లేవు’’ అనే బోర్డులు పెట్టింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : భారత్‌లో ఫాసిజం : రాహుల్ గాంధీ
Coconut Water Lemon Juice: కొబ్బరి బోండం నీళ్లలో నిమ్మ కాయ పిండుకుని తాగితే ఏం జరుగుతుందంటే..