Ajith Ninan Death: కార్టూనిస్టు అజిత్‌ నినన్‌ మృతి

ABN , First Publish Date - 2023-09-09T03:29:48+05:30 IST

ప్రముఖ కార్టూనిస్టు అజిత్‌ నినన్‌ (68) గుండెపోటుతో శుక్రవారం మైసూరులో మృతి చెందారు.

Ajith Ninan Death: కార్టూనిస్టు అజిత్‌ నినన్‌ మృతి

బెంగళూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కార్టూనిస్టు అజిత్‌ నినన్‌ (68) గుండెపోటుతో శుక్రవారం మైసూరులో మృతి చెందారు. హైదరాబాద్‌లో జన్మించిన అజిత్‌, చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి, అనంతరం కార్టూనిస్టుగా స్థిరపడ్డారు. ఇండియాటుడే, అవుట్‌లుక్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర పత్రికల్లో కార్టూని్‌స్టగా పనిచేశారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఢిల్లీలో సేవలందించి, రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్నారు.

Updated Date - 2023-09-09T03:29:49+05:30 IST